మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో లోక్సభ ,అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు గెలుపుకు సంబంధించిన కసరత్తులను ప్రారంభించాయి.త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా అధికార వైసీపీ పార్టీ సీఎం జగన్.. సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నాడు. ప్రతిపక్ష పార్టీలు అయినా టీడీపీ, జనసేన కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాజకీయంగా విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు .
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మంత్రి చెల్లుబోయిన వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తన వల్ల కాదని మూసేశాడని.. అన్నయ్య మూసేస్తే 2014లో తమ్ముడు వచ్చాడని తీవ్ర విమర్శలు చేశాడు మంత్రి వేణు. 2014లో ఓటమిని ఎన్నికల ముందే ఒప్పుకుని.. పోటీ నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకున్నాడని ఆయన తెలిపారు. 2014లో జగన్ ఓడిపోయినప్పటికీ ధైర్యంగా నిలబడ్డారని.. 2019లో 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి చూపించాడని మంత్రి వేణు అన్నారు.