సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి జాతర మొదలై ఉగాది వరకు మల్లన్న జాతర అత్యంత ఘనంగా జరుగుతుంది. సంక్రాంతికి మొదలైన ఈ జాతరకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి 3వ ఆదివారం సందర్భంగా రూ.55,70,464 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి వెల్లడించారు.మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్జిత సేవలు, దర్శనాలు,గదులు, ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా శనివారం రూ.3,69,032, ఆదివారం రూ.45,65, 237, సోమవారం రూ.6,36,195 ఆదాయం వచ్చి నట్లు వారు పేర్కొన్నారు.
గత సంవత్సరం 3వ వారానికి రూ.37,99,740 ఆదాయం వచ్చింది. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి రూ.17,70,724 అదనంగా ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా స్వామి వారి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ నీల శేఖర్,ఆలయ ఏఈవో గంగా శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, కమిటీ సభ్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది ,ఒగ్గు పూజారులు ఉన్నారు.