తెలంగాణ వైద్యారోగ్యశాఖలో డిప్యూటేషన్లు రద్దు.. ఉత్తర్వులు జారీ..!

-

రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో అన్ని స్థాయిల్లో డిప్యూటేషన్లు, వర్క్ ఆర్డర్ల పద్దతిలో పని చేసే విధానంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యారోగ్య శాఖ పరిధిలోని అన్ని హెచ్ఓడీలలో డిప్యూటేషన్ మీద, వర్క్ ఆర్డర్ పద్దతి మీద ఇతర విభాగాల నుంచి వచ్చి పని చేస్తున్న వారిని గురువారం సాయంత్రం ఐదు గంటలవరకు వారి వారి పేమెంట్ డిపార్టుమెంట్ కి పంపించేయాలని.. తక్షణమే ఈ ఉత్తర్వులను అమలులోకి తీసుకోవాలని సంబంధిత అధికారులలను ఆమె ఆదేశించారు.

హెచ్ఓడీ, డిపార్టుమెంట్ నుంచి ఎవ్వరినీ పూర్వ స్థానానికి పంపారో జాబిాను తయారు చేసి గురువారం సాయంత్రం వరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి కార్యాలయానికి అందజేయాలని సూచించారు. ఆయా హెచ్ఓడీలలో డిప్యూటేషన్, వర్క్ ఆర్డర్ పద్దతిలో పని చేసే సిబ్బంది లేరనే విషయాన్ని కూడా ధృవీకరిస్తూ గురువారం సాయంత్రం వరకు హెల్త్ సెక్రెటరీ ఆఫీస్ లకు రాత పూర్వకంగా క్లారిటీ ఇవ్వాలని నొక్కి చెప్పారు. ఇకపై డిప్యూటేషన్ లేదా వర్క్ ఆర్డర్ పద్దతిలో పని చేయించుకునేలా సిబ్బందిని తీసుకున్నట్టయితే విధిగా ప్రభుత్వం నుంచి లేదా జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని సంబంధిత హెచ్ఓడీ అధికారులకు ఆమె స్పష్టం చేసారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news