అఖండ-2కు రంగం సిద్ధం.. బాలయ్య ఫ్యాన్స్ ​కు పూనకాలు లోడింగ్​!

-

ఆరుపదుల వయసులోనూ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. బాలయ్య సినిమా ఇంటే చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అందరూ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తారు. అలా కరోనా చివరి దశలో థియేటర్లకు జనాలు వస్తారో రారో, సినిమాలు విడుదల చేయాలా వద్దా అన్న సందేహంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉండగా బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అందించి ఇండస్ట్రీకి మళ్లీ ఊపిరి పోసింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ బోయపాటి 2021లోనే ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.

బోయపాటి అప్పటికే అల్లు అర్జున్‌, సూర్య(కోలివుడ్​) కోసం కథలను కూడా రెడీ చేసుకుంటున్నారట. అయితే ప్రస్తుతం ఆ హీరోలిద్దరు ఇప్పడుు వేరే సినిమాల షూటింగులతో బిజీగా ఉండటంతో మరోసారి తెరపైకి అఖండ-2 వచ్చింది. మరి ఈ కాంబోలో ‘అఖండ 2’నే పట్టాలెక్కుతుందా లేక, వేరే కథతో సినిమా చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అఖండ 2 కోసం అయితే ఇప్పటికే స్క్రిప్ట్‌ కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news