సీఎం జగన్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర 2’. జీవిత చరిత్ర అంటే ఆయన చిన్నతనం నుండి కాకుండా, కేవలం రాజకీయ ప్రయాణం ని మాత్రమే ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటి భాగం ‘యాత్ర’ లో ఆయన తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ని చూపించగా, రెండవ భాగం ఆయన తనయుడి బయోపిక్ ని చూపించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నిటికీ కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మీద హైప్ పెంచేలా చేసింది. అలా భారీ అంచనాల నడుమ నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుండా లేదా అనేది ఈ రివ్యూ లో చూసి తెలుసుకుందాం.
కథ :
రాజశేఖర్ రెడ్డి మొదటి టర్మ్ లో ముఖ్యమంత్రి అయినా తర్వాత ప్రజలతో మమేకమై ఎంత మంచి పథకాలను పెట్టాడో, ఎలాంటి సుపరిపాలన అందించాడో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ తర్వాత రెండవ టర్మ్ లో ముఖ్యమంత్రి గా గెలిచి ఆరు నెలలు పరిపాలన అందించిన తర్వాత హెలికాప్టర్ ప్రమాదం లో చనిపోవడం, ఆ తర్వాత రాష్ట్రం లో ఏర్పడిన పరిస్థితులన్నీ చూపించాడు డైరెక్టర్.
తన తండ్రి మరణవార్త విని ఎన్నో వేలాది మంది అభిమానులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం, వాళ్ళ కుటుంబాలను ఓదార్చడానికి జగన్ ‘ఓదార్పు యాత్ర’ చేపట్టడం, ఆ యాత్ర ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ జగన్ ని కట్టడి చేయాలనుకోవడం, ఆయన హై కమాండ్ ని లెక్కచెయ్యకుండా బయటకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టడం వంటి అంశాలు వెండితెర పై చూస్తే జగన్ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకుంటాయి. తన ఆజ్ఞ ని ధిక్కరించినందుకు జగన్ పై అనేక అక్రమ కేసులు పెట్టించి 16 నెలలు జైలు పాలయ్యేలా చెయ్యడం, ఆ తర్వాత బయటకి వచ్చిన తర్వాత జగన్ చేసిన పోరాటాలు, సీఎం అయ్యేందుకు ఆయన చేసిన పాదయాత్ర ఇలా ఎన్నో సంఘటనలు వెండితెర మీద చూడొచ్చు.
విశ్లేషణ :
డైరెక్టర్ మహి వి రాఘవ్ ఈ సినిమాలోని స్క్రీన్ ప్లే కేవలం జగన్ అభిమానులకు మాత్రమే కాదు. మామూలు ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా రాసాడు. చాలా సన్నివేశాలు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేలా చేస్తుంది. నటీనటుల పెర్ఫార్మన్స్ ని పిండుకున్నాడు డైరెక్టర్. ముఖ్యంగా జగన్ పాత్ర ని పోషించిన తమిళ హీరో జీవా గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. జగన్ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుండి, ముఖ కవిలకల వరకు ప్రతీ ఒక్కటి మక్కీకి మక్కి దింపేసాడు.
వెండితెర మీద జగన్ నే వచ్చి నటించాడా అనే రేంజ్ లో ఆయన కనపడ్డాడు. కేవలం భజన మాత్రమే చెయ్యకుండా సీఎం జగన్ ఎదురుకున్న ప్రతికూల పరిస్థితులను, జయాపజయాలను కూడా చూపించి ఒక ఎమోషనల్ రోల్లర్ కోస్టర్ గా ఈ సినిమాని తెరకెక్కించిన తీరు బాగుంది. ఇక రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముటి కూడా జీవించేసాడు. ప్రతిపక్షాలను విమర్శించే విధంగా సన్నివేశాలు ఉంటాయేమో అని అనుకున్నారు కానీ, వాటి జోలికి పోకుండా కేవలం జగన్ యొక్క ఇమేజి పెంచే విధంగా ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్.
చివరి మాట :
జగన్ అభిమానులకు మాత్రమే కాదు, ఇతర ఆడియన్స్ కి కూడా ఎంతో నచ్చే సినిమా ఇది.
నటీనటులు : మమ్ముటి , జీవా, మహేష్ మంజ్రేకర్ తదితరులు
దర్శకత్వం : మహి వి రాఘవ్
నిర్మాత : శివ మేక
సంగీతం : సంతోష్ నారాయణ్
రేటింగ్ : 3/5