బీఏసీ సమావేశం నుంచి బయటకు వచ్చిన హరీశ్‌రావు

-

అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం భేటీ జరుగుతోంది. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో శాసనసభ పని దినాలను ఖరారు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల పనిదినాలు, ఎజెండా ఖరారు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు, అది కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో దాదాపు వారం రోజులు సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్న సమాచారం. బీఏసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కడియం శ్రీహరి, అక్బరుద్దీన్ ఓవైసీ, మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

అయితే బీఏసీ సమావేశానికి వెళ్లిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు భేటీ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే బయటకు వచ్చారు. కేసీఆర్ బదులుగా బీఏసీ హరీశ్‌రావు సమావేశానికి వెళ్లారు. తన బదులుగా హరీశ్‌ రావు బీఏసీకి వస్తారని కేసీఆర్‌ ముందే సమాచారమిచ్చినట్లు తెలిసింది. అయితే బీఏసీకి హరీశ్‌రావు రావడంపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాసేపటి తర్వాత హరీశ్‌ రావు ఈ సమావేశం నుంచి బయటకు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news