విజయ్ పొలిటికల్‌ ఎంట్రీపై ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

-

ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఏదైనా విషయంపై తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తమిళనాడులో విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది రాజకీయాల్లో రాణించారని, ముఖ్యమంత్రులుగా సేవలు చేశారని అన్నారు. నటుడిగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న విజయ్‌ ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే అది చాలా గొప్ప విషయమని ప్రశంసించారు.

సమాజంలో మార్పు రావాలని కోరుకునే లీడర్‌ ఎవరైనా సపోర్ట్‌ చేయాలనేది తన అభిప్రాయమని స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి వాళ్లకు సపోర్ట్‌ చేయకపోయినా.. వెనక్కి మాత్రం లాగకూడదని అన్నారు. విజయ్‌ గొప్ప రాజకీయనాయకుడు అవుతారని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక తాను మాత్రం రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. మార్పు తీసుకువచ్చే నాయకుడికి మద్దతు ఇస్తానని ఉపాసన చెప్పారు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ తాను తెలుగు, తమిళ సినిమాలను సబ్ టైటిల్స్‌తో చూస్తానని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news