ప్రధాని నరేంద్ర మోడీని జగన్ కలిశారు. ఈరోజు ఢిల్లీ వెళ్లిన ఆయన ఏపీ అంశాలపై ప్రధాని మోడీ తో గంటన్నర పాటు చర్చలు జరిపారు ఏపీకి ప్రత్యేక హోదా తెలంగాణ నుండి రావాల్సిన నిధులు గురించి మాట్లాడారు. అలానే రైల్వే జోన్ కడప స్టీల్ ప్లాంట్ పోలవరం వంటి వాటి గురించి ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు జగన్.
మోడీతో భేటీ తర్వాత నిర్మల సీతారామన్ ని సీఎం కలిశారు. పార్లమెంట్ భవనంలో ఆర్థిక శాఖ కార్యాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు త్వరగా విడుదల చేయాలని అన్నారు. ఈ భేటీ అనంతరం సీఎం జగన్ ఏపీకి వచ్చేసారు ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకోబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇంకోపక్క బీజేపీ పెద్దల్ని చంద్రబాబు కలుస్తున్నారు