రాజ్య‌స‌భలో క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఎంపీ జ‌యా బ‌చ్చ‌న్‌… వీడియో

-

న్యూఢిల్లీ: ఎంపీ జ‌యాబ‌చ్చ‌న్ రాజ్య‌స‌భ‌లో క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. జయ బచ్చన్ మాట్లాడుతూ.. తాను షార్ట్ టెంపర్ వ్యక్తిని అన్నారు.ఎవ‌ర్నీ బాధ పెట్ట‌డం త‌న ఉద్దేశం కాద‌న్నారు. ఎప్పుడు ఆవేశానికి లోనవుతుంటావు ఎందుకు అని అందరూ తనని ప్రశ్నిస్తారని అది తన స్వభావమని , దాన్ని మార్చుకోలేనని ఆమె చెప్పారు. ఏదైనా విషయాన్ని అంగీకరించకపోతే తన సహనాన్ని కోల్పోతానని ఆమె అన్నారు.

ఎవరితోనైనా అసంబద్ధంగా వ్యవహరిస్తే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.త‌న చివ‌రి ప్ర‌సంగం సంద‌ర్భంగా ఆమె చేతులో జోడించి సారీ చెప్పారు. జయ బచ్చన్ మాటతీరు కఠినంగా ఉంటుంది. ఆమె సాధారణంగా ఎప్పుడు కోపంగా ఉంటుంది. ఆమె ఆవేశంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై కూడా కామెంట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news