ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కొంత అయిష్టంగానే ఉంది అని డిప్యూటీ సీఎం, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఫిబ్రవరి 01న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ పెడితేనే మన రాష్ట్రానికి ఎంత మేరకు నిదులు వస్తాయనేది తెలుస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని విద్య, వైద్య, ఉపాధి విభాగాల్లో అభివృద్ధి సాధిస్తామన్నారు.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం ఆధారంగా రాష్ట్రంలో పంటల బీమాను మరింత పటిష్టంగా అమలు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో అమలు అవుతున్న పథకాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాం. రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. అందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.