నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే మెగా డీఎస్సీ..!

-

తెలంగాణలో  నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే నర్సింగ్ విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించక ఇబ్బందులు పడ్డారని.. కొంత మేరకు నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ వాటిలో అవకతవకలు జరిగాయని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

తాజాగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మాట్లాడిన భట్టి.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. మెగా డీఎస్సీ వేయబోతున్నాం.. 15000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేయబోతున్నాం.. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన గ్రూప్ 1 లో 64 అదనపు పోస్టులు జత చేశామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం.. అధికారంలోకి వచ్చిన వెంటనే 6,956 నర్సింగ్ పోస్టులను భర్తీ చేసి నియామక ప్రతాలను అందజేసినట్టు వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో అందరికీ న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news