కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ లో తీసుకువచ్చిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మీద ఆర్మూర్ బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పందించారు. బడ్జెట్ తర్వాత ఆయన మీడియా చిట్ చాట్ లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర తెలంగాణ మీద వివక్ష చూపుతోందని అన్నారు. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు అన్ని దక్షిణ తెలంగాణకి సీఎం మంత్రులు తరలించకపోతున్నారు.
కొండగల్ నారాయణపేట ఎత్తిపోతలకే సీఎం 2900 కోట్లు కేటాయించుకున్నారని అన్నారు అలానే మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి తమ జిల్లాలకు అత్యధిక నిధులు తరలిస్తున్నారని అన్నారు ఇది మంచిది కాదని అన్నారు. ఇలానే వివక్ష కొనసాగితే ఉత్తర తెలంగాణలో మళ్లీ ప్రజలు తుపాకులు చేపడతారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.