Telangana Budget 2024: కొండంత ఆశ చూపించి గోరంత కూడా కేటాయించని బడ్జెట్ ఇది : హరీశ్ రావు

-

కొండంత ఆశ చూపించి గోరంత కూడా కేటాయించని బడ్జెట్ ఇది అని హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు హరీశ్ రావు.  ముఖ్యంగా డిసెంబర్ 09వతేదీనే రుణమాఫీ చేస్తామని నమ్మించారు. రెండు నెలలు గడిచినా రుణమాపీ చేయలేదన్నారు. ఆరు గ్యారెంటీల అమలు పై స్పష్ట ఇవ్వలేదన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ ఇస్తుందన్నారు. 

బోనస్ ను భోగస్ చేసింది. రుణమాఫీకి బడ్జెట్ లో నిధులను కేటాయించలేదు. 82వేల కోట్ల అవసరం అయితే.. 16వేల కోట్లకే బడ్జెట్ పెట్టిందన్నారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక మోసపోతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్దాలు చెప్పారు. అసెంబ్లీలో కూడా అబద్దాలే చెప్పారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉచిత కరెంట్ ఇచ్చామని.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉచిత కరెంట్ ఇవ్వలేదని.. కరెంట్ కోసం రైతులు ఘోస పడ్డారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై   రైతులు ఆగ్రహానికి గురికాక తప్పదు అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news