Telangana: నేడు తెలంగాణ అసెంబ్లీ పునః ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరుగనుంది. ముఖ్యంగా ఇవాళ్టి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం పెడతారు. ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ జరుగనుంది. అలాగే…తెలంగాణ ఇరిగేషన్ పై చర్చ ఉంటుంది. krmbకి ప్రాజెక్టులు అప్పగించేది లేదని ప్రభుత్వ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.
అలాగే…AP సీఎం జగన్.. రాయలసీమ ప్రాజెక్టుకు అనుమతి పై కేసీఆర్ ను ఉద్దేశించి ఓ వీడియో కూడా అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ…కృష్ణా జలాలపై అసెంబ్లీలో క్లారిటీ ఇస్తామని.. అసెంబ్లీలో మా ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. రేపు కేసీఆర్ మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపు తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్తామని.. తెలంగాణ నీళ్లను జగన్ కోసం ఏపీకి తరలించారని ఫైర్ అయ్యారు. సెంటిమెంట్ వాడుకుందామంటే ప్రజలు బుద్ధి చెప్తారు…ఏపీకి నీళ్ల విషయంలో కేసీఆర్ సహాయం చేశారని జగన్ అసెంబ్లీ లో చెప్పారన్నారు.