ఓవైపు విడాకులు, మరోవపై మయోసైటిస్ వ్యాధి.. ఇలా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రముఖ నటి సమంత సినిమాలు, షూటింగుల నుంచి కొంత కాలం విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడాది నుంచి ఎలాంటి వర్క్ లేకుండా సైన్ చేసిన సినిమాలు కూడా రిటర్న్ చేసింది. కొద్దిరోజులుగా వెకేషన్లకు వెళ్తూ రీఛార్జ్ అవుతోంది. ఇక ఇటీవలే వెకేషన్ నుంచి కూడా తిరిగొచ్చేసింది.
ఇక త్వరలో తాను మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్నట్లు అభిమానులకు తీపి కబురు వినిపించింది సమంత. తాజాగా సినిమా షూటింగ్ ను మొదలు పెడుతున్నట్లు తెలుపుతూ ఇన్స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ‘ఇప్పటికే చాలా మంది ఎప్పుడు షూటింగ్లో పాల్గొంటారని అడుగుతున్నారు. చివరకి ఆ సమయం వచ్చేసింది. నేను త్వరలో మళ్లీ నా పనిని ప్రారంభించబోతున్నాను. కొన్ని రోజులు నేను ఒక నిరుద్యోగిగా ఉన్నాను. కానీ.. నేను నా స్నేహితులు కలిసి ఆరోగ్య పాడ్కాస్ట్పై ఓ కార్యక్రమాన్ని చేశాము. త్వరలో దానిని విడుదల చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చిందామె. ఈ పోస్టు చూసి సామ్ ఫ్యాన్స్ చాలా ఆనంద పడుతున్నారు.