సీఎం జగన్ ఏపీని గంజాయి రాజధానిగా మార్చారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా ఆరోపించారు. ‘చంద్రబాబును జగన్ 53 రోజులపాటు చెత్త విరుద్ధంగా జైల్లో పెట్టారు. సొంత బాబాయినే చంపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తలపై భారీ సంఖ్యలో కేసుల్ని పెట్టారు. నామీద 22 కేసులు ఫైల్ చేశారు. తనను వ్యతిరేకించే వారిని అడ్డు తొలగించుకోవడమే జగన్ విధానం’ అంటూ లోకేష్ మండిపడ్డారు.
సీఎం జగన్ ను గద్దె దించేందుకు జనం సిద్ధమయ్యారని టీడీపీ నేత నారా లోకేశ్ చురకలు అంటించారు. మోసం, దగా, కుట్రలకు ఫ్యాంటు-షర్టు వేస్తే జగన్‌లా ఉంటుందని చురకలు అంటించారు. మెగా డిఎస్సీ తీస్తానని హామీ ఇచ్చి దగా చేశాడు. డిఎస్సీ ద్వారా ఖాళీ పోస్టులు భర్తీ చేసే బాధ్యత టిడిపి తీసుకుంటుందని తెలిపారు నారా లోకేష్. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంపుతున్న జగన్, మరింత మందిని చంపేందుకు తాను సిద్ధం అంటున్నారని తెలిపారు. సైకో జగన్‌ని గద్దె దించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.