మరో 65 రోజుల్లో ఏపీ ఎన్నికలు, మే 15న ఫలితాలు !

-

ఎన్నికల ముందు వైకాపా ఖాళీ అవుతుందని తాను ఐదారు నెలల క్రితమే చెప్పానని రఘురామకృష్ణ రాజు గారు గుర్తు చేశారు. వైకాపా నాయకుల్లో ఎంత అసంతృప్తి ఉందో తనకు ముందే తెలుసునని, సీనియర్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని దారుణంగా అవమానించారని, నమస్కారం పెడితే, ప్రతి నమస్కారం చేయడం అన్నది సమస్కారమని, ఆ సంస్కారం వైకాపా నాయకులకు లేదని అన్నారు.

మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా పార్టీ వీడనున్నారని తెలుస్తోందని, అలాగే పార్టీకి ఎంతో ఆర్థిక సహాయ సహకారాలు అందజేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పార్టీ వీడనున్నారట అని అన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇప్పటికే దూరం చేసుకున్నారని, కృష్ణాజిల్లాలో కృష్ణ ప్రసాద్ గారితో పాటు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా ఎంతో మంది పార్టీ నుంచి వలసలు వెళ్లారని అన్నారు.

అంతా ఒకే ఒక నాయకుడి నడవడిక వల్లేనని… ఏమీ చేయకుండానే చేశామని చెప్పడం వల్ల ప్రజలు గుడ్డిగా నమ్మరని, మరో 65 రోజుల్లో ఎన్నికలు వచ్చేస్తాయని, మే 15వ తేదీ నాటికి ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతాయని, ఆ తర్వాత వైకాపా పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందేనని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news