BRS పార్టీ అధ్యక్షుడిగా హరీష్‌ రావును చేయాలి – రాజగోపాల్‌ రెడ్డి

-

కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వారసుడు హరీష్ రావు అని…ఆయనను బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు అయితేనే ఆ పార్టీ బతుకుతుందన్నారు. కేటీఆర్ పొలిటీషియన్ కాదు.. హైటెక్ పొలిటీషియన్ అంటూ సెటైర్లు పేల్చారు. బీఆర్ఎస్ లో చాలా మంది నేతలు అవమానానికి గురైనా ఉన్నారన్నారు.

Rajagopal Reddy Chit Chat

అవినీతి మరక లేని నేతలను మాత్రమే కాంగ్రెస్ లోకి తీసుకుంటామని… డబ్బు ఉన్న నేతలు పార్టీలోకి వస్తే మాకు ఎలా వాడుకోవాలో తెలుసన్నారు. కేబినెట్ విస్తరణ పై నాకు సమాచారం లేదు…ఎన్నిరోజులు అధికారంలో ఉంటామనేది మనం చెప్పలేము..ప్రభుత్వం పడిపోవడానికి ఒక్క ఉదంతం చాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే టాక్ ఉంది..2029 గురించి ఇప్పుడు ఏం చెప్పలేమని తెలిపారు. 5 ఏళ్ళు మా ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుంటే మంచిది..టీఆరెస్ బతకాలంటే హరీష్ రావు పార్టీ అధ్యక్షుడు కావాలని కోరారు. కేటీఆర్ పార్టీ అధ్యక్షుడు అయితే.. పార్టీ లో ఓక్కడు ఉండడని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news