శివ బాలకృష్ణ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. హెచ్ఎండిఏ లో జరిగిన భూముల వేలం లో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. వేలానికి ముందే పలువురు రియాల్టర్లకు సమాచారం ని అధికారులు చేరవేశారు. పలువురు రియాల్టర్లకే భూములు దక్కేలా అధికారుల చేసారు. ఏసీబీ నివేదిక ఇచ్చింది ప్రభుత్వానికి. వేలంపాటను ఆపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అలానే ఇప్పటికే వేలం వేసిన భూములపై అధికారుల విచారణ చేస్తున్నారు. వేలంపాట సమయంలో HMDA లో శివ బాలకృష్ణ పని చేసాడు. భూములు వేలం తో పాటు ప్రాజెక్టుల వివరాలు రియల్టర్లకు అధికారులు చేర్చారు. హెచ్ఎండిఏలో పలువురు అధికారులపై ఎసిబి దర్యాప్తు చేస్తోంది.