హెడ్ కోచ్ జైసింహ తమ పట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి మహిళా క్రికెటర్లు కంప్లైంట్ చేశారు బస్సులో తమ ముందే మద్యం సేవించాడని అడ్డు చెప్పడంతో బండ బూతులు తిట్టాడని మహిళా క్రికెటర్లు కంప్లైంట్ చేశారు. దాంతో కోచ్ పదవి నుండి జై సింహా ని తక్షణమే తప్పించారు హెచ్ ఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు.
ఈ ఆరోపణల మీద కోచ్ జై సింహా స్పందించారు ఏ తప్పు చేయలేదని ఎటువంటి విచారణ చేయకుండా తనపై చర్యలు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. నేను మద్యం సేవించలేదు కూల్ డ్రింక్ మాత్రమే తాగాను. నేను ఎవరిని వేధించలేదు నన్ను సస్పెండ్ చేశారు ఎటువంటి విచారణ చేయకుండా నా మీద ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. మహిళా క్రికెటర్ల రక్షణకి భంగం కలిగితే ఉపేక్షించింది లేదని విచారణ ముగిసే వరకు జై సింహ ని సస్పెండ్ చేసినట్లు జగన్మోహన్ రావు అన్నారు.