ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అయితే ఈ క్రమంలో టిడిపి బిజెపి పొత్తు విషయంలో జరిగిన చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పొత్తుపై బిజెపి జాతీయ కౌన్సిలర్ సమావేశంలో ఇప్పటికే చర్చించింది కూడా రాష్ట్రవ్యాప్తంగా 20 అసెంబ్లీ స్థానాలు మీద ఏపీ బిజెపి ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు చర్చలు జరిపిన అమిత్ షా బీజేపీకి పట్టున్న అసెంబ్లీ స్థానాల వివరాలని సిద్ధం చేశారట.

సీట్లపై కసరత్తు చేసి రాష్ట్ర బిజెపి 20 అసెంబ్లీ స్థానాలతో ఒక జాబితాని రూపొందించింది కృష్ణ లో రెండు, తూర్పుగోదావరి మూడు, గుంటూరు నాలుగు, నెల్లూరు రెండు, కడప ఒకటి, చిత్తూరు ఒకటి, పశ్చిమగోదావరిలో మూడు సీట్లు కోరుతోంది శ్రీకాకుళం విజయనగరం ప్రకాశం అనంతపురంలో ఒక్కొక్కటి చొప్పున పోటీ చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది