మంత్రి కోమటి రెడ్డి: కలెక్షన్ కింగ్ హరీష్ రావు చెబితే మేము వినాలా..?

-

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీద సంచలన కామెంట్స్ చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ కెసిఆర్ ఏ, డిజైనర్ కేసీఆర్ ఏ అన్నారు. కాంట్రాక్టర్ కెసిఆర్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీలకి వచ్చి సమాధానం చెప్పాలని అన్నారు.

హరీష్ రావు మాటలకి విలువ లేదని అన్నారు. హరీష్ రావు ని కేసీఆర్ కలెక్షన్లకు వాడుకుంటున్నారని కాంట్రాక్టర్ల దగ్గర వసూళ్లు చేయడానికి హరీష్ రావు పనికి వస్తాడని కోమటిరెడ్డి అన్నారు. కాలేశ్వరం మీద ఆయనకి అవగాహన లేదని అన్నారు తమ నియోజకవర్గంలో బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు ఉందని అన్నారు ఇప్పటికే 80% పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news