హాలీవుడ్ కి వెళ్లిపోతా: డైరెక్టర్ సందీప్ వంగా

-

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన  చిత్రం యానిమల్. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని పలువురు సెలబ్రిటీలు విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ నేపథ్యంలో డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనను ఇండియాలో సినిమాలు తీయనీయకపోతే హాలీవుడ్కు వెళ్లిపోతానని ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అన్నారు. ‘నాకు భాషా పరిమితులు లేవు. ఏ భాషలోనైనా సినిమా తీస్తా అని తెలిపారు. నా మూవీని ప్రేక్షకులు విమర్శిస్తే పెద్దగా పట్టించుకోను. కానీ అన్నీ తెలిసిన సెలబ్రిటీలూ నన్ను విమర్శిస్తున్నారు. అదే బాధగా ఉంది’ అని పేర్కొన్నారు.

బాబి డియోల్, అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.డిసెంబర్ ఒకటవ తేదీన విడుదలైన యానిమల్ చిత్రం 900 కోట్ల భారీ వసూళ్లను సాధించింది.ఈ చిత్రం  నెట్ ఫ్లిక్స్  వేదికగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల  అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news