వివాదంలో సాయిధరమ్ తేజ్ మూవీ ‘గాంజా శంకర్’..పోలీసుల నోటీసులు !

-

టాలీవుడ్‌ మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు కొత్త చిక్కులు వచ్చాయి. మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్’ పేరు పై వివాదం చుట్టుముట్టింది.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న గాంజా శంకర్ మూవీ టైటిల్‌పై తెలంగాణ రాష్ట్ర నార్కొటిక్ బ్యూరో(TSNAB) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమా పేరును మార్చాల్సిందేనంటూ చిత్రబృందానికి నోటీసులు పంపింది తెలంగాణ రాష్ట్ర నార్కొటిక్ బ్యూరో(TSNAB).

Telangana State Narcotics Bureau is angry over the title of the movie ‘Ganja Shankar’ starring mega hero Saidharam Tej

ఈ మూవీ ట్రైలర్ సైతం యువతపై ప్రభావం చూపేలా ఉందని, దాన్ని కూడా మార్చాలని ఆదేశించింది తెలంగాణ రాష్ట్ర నార్కొటిక్ బ్యూరో(TSNAB). సినిమా ఆర్టిస్టులు, ఇతర సెలబ్రిటీలు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలని నోటీసుల్లో పేర్కొంది తెలంగాణ రాష్ట్ర నార్కొటిక్ బ్యూరో(TSNAB). సినిమాలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ ని ప్రోత్సహించే విధంగా ఉంటే తొలగించాలని కోరింది నార్కోటిక్ బ్యూరో. సినిమాలో గంజాయి డ్రగ్స్ ని ఎట్టి పరిస్థితుల్లో చూపెట్టవద్దని వార్నింగ్‌ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news