టీమిండియా యువ బ్యాట్స్ మెన్ యశస్వి జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా అవసరం పనిలేదు. జట్టులో స్థానం పొందిన కొన్నాళ్లకే పూర్తి స్థాయి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జైస్వాల్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టుల్లో చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే యశస్వి జైశ్వాల్ పేరిట కొన్ని రికార్డులు నమోదయ్యాయి. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస టెస్టుల్లో డబుల్ సెంచరీలు సాధించాడు. 236 బంతులలో జైస్వాల్ 14 ఫోర్లు, 12 సిక్సులతో 214 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
* ఓ టెస్ట్ సిరీస్లో ఇండియా తరఫున అత్యధిక సిక్సర్లు (22*)
* 23 ఏళ్లలోపే అత్యధిక సార్లు 150+ స్కోర్ చేసిన ఇండియా బ్యాటర్
* టెస్టుల్లో వేగంగా ద్విశతకం బాదిన రెండో ఇండియా ప్లేయర్
* వరుస మ్యాచుల్లో ద్వి శతకాలు చేసిన మూడో ఇండియన్ ప్లేయర్
* ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వసీం అక్రమ్(12) రికార్డు సమం