రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన ‘ఈగల్’ మూవీ

-

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహా రాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఈగల్. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. కావ్య థాపర్ ,మధుబాల ,నవదీప్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలలో నటించారు. ఫిబ్రవరి 9న ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

అయితే ఈగల్ మూవీ రూ.51.4 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా పోటీ ఇచ్చేంత స్థాయి సినిమాలు రాకపోవడంతో ఈ సినిమాకి కలిసొచ్చింది. వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రం, ఎమోషన్స్ పరంగా కంటే యాక్షన్ పరంగానే కనెక్ట్ అయింది. అక్రమ ఆయుధాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news