పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విరాట్-అనుష్క దంపతులు

-

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులు రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఫిబ్రవరి 15న తమ రెండవ సంతానం అకాయ్ అనే మగబిడ్డ పురుడుపోసుకున్నట్లు అనుష్కశర్మ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వార్త తెలియగానే వీరిద్దరికీ సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విషయాన్ని స్వయంగా అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన కుమారుడి పేరును కూడా పోస్ట్‌లో వెల్లడించింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. అనుష్క రెండోసారి గర్భం దాల్చిందని వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయాన్ని ఇద్దరూ ధృవీకరించలేదు. కొంతకాలం క్రితం, దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరి రహస్యాన్ని వెల్లడించాడు. ప్రెగ్నెన్సీ పుకార్లలో నిజంగా నిజం ఉందని అప్పుడు నమ్మారు. అయితే, ఆ తర్వాత ఏబీడీ ఈ వార్త నిజం కాదంటూ ప్రకటించడంతో అందరూ అయోమయంలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news