జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ భీమవరంలో పర్యటించారు. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 20వ తేదీన పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించాల్సి ఉంది. అయితే, పవన్ పర్యటన ఒక రోజు వాయిదా పడింది. ఇవాళ ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ మంగళగిరి నుంచి హెలికాప్టర్ లో భీమవరం కాస్మోపాలిటిన్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నిర్మల ఫంక్షన్ హాల్ కు చేరుకుని జనసేన-టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు.
భీమవరం నుండే పవన్ కళ్యాణ్ ఫొటీ చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. పవన్ కల్యాణ్ నాన్ లోకల్ కాదు, పక్కా లోకల్. చంద్రబాబు, జగన్ మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు. భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి, ఆయన నివాసం ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశామని భీమవరం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ వెల్లడించారు. వాస్తవానికి.. ఈ నెల 14న భీమవరంలో పవన్ పర్యటించాల్సి ఉండగా.. హెలిప్యాడ్ కు అధికారులు అనుమతి నిరాకరించడంతో పర్యటన వాయిదా పడింది.