టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ప్రత్యేక వీడియోను విడుదల చేసిన ఐసీసీ

-

ఈ ఏడాది జూన్ నెలలో అమెరికాలో టీ20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. మరో 100 రోజుల్లో టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐసీసీ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అమెరికాలో ప్రపంచ కప్ జరుగుతుందని తెలియజేసేలా ఈ వీడియో ఉంది. ఇది టీజర్ లా ఉందని.. ఫుల్ గేమ్ ముందుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు మ్యాచుల టికెట్లను కూడా ఐసీసీ రిలీజ్ చేసింది.

కాగా, ఈ ప్రపంచ కప్ లో పాల్గొనే 20 జట్లను నాలుగు గ్రూపులుగా ఐసీసీ విభజించింది.గ్రూప్-ఎలో భారత్, ఐర్లాండ్,పాకిస్థాన్, అమెరికా, కెనడా ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా,స్కాట్లాండ్, నమీబియా, ఒమన్ ఉన్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్,వెస్టిండీస్, ఆప్ఘనిస్తాన్, పపువా న్యూగినియా,ఉగాండ ఉన్నాయి. గ్రూప్-డిలో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్ ,బంగ్లాదేశ్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news