BRS ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లాస్య నందిత స్పాట్లోనే చనిపోయారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే మృతదేహానికి పటాన్చెరువు ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు అయితే ఆమె మృతికి ప్రధాన కారణం అతివేగం డ్రైవర్ నిద్ర మత్తు అని పోలీసులు అనుమనిస్తున్నారు. అయితే.. ఈ కేసులో తాజాగా ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది.
అతివేగంగా వచ్చిన లాస్య నందిత కారు ముందున్న టిప్పర్ లేదా రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ప్రమాదం సమయంలో ఆరు టిప్పర్ లారీలు ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్లినట్లు గుర్తించారు. కారు డ్రైవ్ చేసిన ఆకాష్ రక్త నమోనాలను సేకరించిన పోలీసులు… మద్యం సేవించాడా లేదా అనే దానిపైన విచారణ చేస్తున్నారు.
అయితే.. ప్రమాదం జరుగక ముందే..లాస్య కారులోనే అక్క కూతురు శ్లోక ఉన్నారు. కానీ ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు శ్లోక ను మరో కారులోకి ఎక్కించింది లాస్య. దీంతో ప్రమాదం నుంచి తప్పించుకుంది శ్లోక. శ్లోక కు స్కూల్ వెళ్లాల్సి ఉండడంతో మరో కారులోకి శ్లోకను పంపించారట లాస్య.