ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్లో పర్యటించారు. ద్వారకాలో ఆయన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన “సుదర్శన్ సేతును ” ప్రారంభించారు. దేవభూమి ద్వారకా జిల్లాలోని ఓఖా ప్రధాన భూభాగాన్ని బేత్ ద్వారకా ద్వీపంతో ఈ వంతెన అనుసంధానిస్తుంది. ఇంతకు ముందు ఈ వంతెనను ” సిగ్నేచర్ బ్రిడ్జ్ అని పిలిచేవారు. అయితే ప్రస్తుతం సుదర్శన్ సేతు అని పేరు మార్చారు. వంతెన ప్రారంభించిన చిత్రాలను ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అద్భుతంగా ఉన్నాయంటూ అందులో పేర్కొన్నారు.
సుదర్శన్ సేతు వంతెన గురించి మరికొన్ని విశేషాలు..
మొత్తం 979 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన ద్వారకాదీశ్ ఆలయ సందర్శనకు వెళ్లేందుకు ఉపయోగపడనుంది.
అరేబియా సముద్రంపై 2.32 కిలోమీటర్ల మేర ఈ వంతెనను నిర్మించారు.
2017లో దీనికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
మొత్తం 27.20 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో ఈ వంతెనను నిర్మించారు.
ఈ బ్రిడ్జ్‌పై 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్‌పాత్ కూడా ఉంది.
వంతెనపై రెండు వైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు.
ఈ వంతెనపై పలు చోట్ల సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసి ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు.
આજે દ્વારકા ખાતે “સુદર્શન સેતુ” નું ઉદ્ઘાટન કરતા ખૂબજ આનંદ થયો.
આ સેતુનું નિર્માણ એ વિકાસ માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે અને આનાથી પ્રવાસન પ્રવૃત્તિને મોટા પ્રમાણમાં વેગ મળશે. pic.twitter.com/Cv9X0by8Vb
— Narendra Modi (@narendramodi) February 25, 2024