షాకింగ్ న్యూస్: బీమా సొమ్ము కోసం రెండు కాళ్లు నరికేసుకున్న వృద్ధుడు

-

కొందరు డబ్బుల కోసం.. కిరాతకంగా ఆలోచిస్తారు.. సొంత వాళ్లను చంపడానికి కూడా వెనకాడరు..మనం ఇలాంటి వార్తలను ఎన్నో విన్నాం..బీమా డబ్బుల కోసం భర్తను చంపేసిన భార్య, తల్లిదండ్రులను చంపేసిన కొడుకు ఇలాంటివి మనం వింటూనే ఉన్నాం..కానీ ఇక్కడ ఓ వృద్ధుడు బీమా డబ్బుల కోసం తన కాళ్లనే నరికించేసుకున్నాడు. షాక్‌ అయ్యారా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

మిస్సౌరీ నివాసి చేసిన నేరం పోలీసులను కలవరపరిచింది. ఈ ఘటన గతేడాది జరగ్గా, పోలీసులు ఎట్టకేలకు నిజాన్ని బయటపెట్టారు. హోవెల్ కౌంటీ షెరీఫ్ పోలీసుల కథనం ప్రకారం.. 60 ఏళ్ల వ్యక్తి తన కాలు ట్రాక్టర్‌తో అమర్చిన మొవర్‌లో చిక్కుకుందని, రెండు కాళ్లు కత్తిరించబడిందని బీమా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ కోసిన అతని కాళ్లు మాత్రం కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ తర్వాత అసలు నిజం బయటపడింది.

మనిషి కాలు మీద గాయాలు లేవు.. కోత యంత్రం ద్వారా కోసినట్లు కనిపించలేదు. ఇన్ని అనుమానాలతో విచారణకు వెళ్లిన పోలీసులకు మరో విషయం తెలిసింది. 60 ఏళ్ల వృద్ధుడు స్ట్రోక్‌తో బాధపడుతున్నాడు. అతని వీపు కింది భాగం పని చేయడం లేదు. అలాంటి వ్యక్తి ట్రాక్టర్‌ వద్దకు ఎలా వెళ్లాడన్న ప్రశ్న కూడా తలెత్తింది.

ఆ వ్యక్తి ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఒక భయంకరమైన పని చేశాడు. పక్షవాతం కారణంగా అతని కాళ్లు బలాన్ని కోల్పోయాయి. కాలు వల్ల ఉపయోగం లేదు. అందుకే ఓ వ్యక్తిని తన ఇంటికి పిలిపించి కాళ్లు నరికి వేయమని అడిగాడు. ఇందుకోసం డబ్బు కూడా ఇచ్చాడు. ఇంటికి వచ్చిన వ్యక్తి కాళ్లు నరికేశాడు. కాలు తెగిపోవడంతో ట్రాక్టర్ వల్ల ప్రమాదం జరిగిందని, బీమా సొమ్ము ఇప్పిస్తానని వృద్ధుడు చెప్పాడు. అయితే విచారణలో అసలు నిజం బయటపడింది. అతని తెగిపడిన కాళ్లు కూడా ఇంట్లో కనిపించాయి. అతను తన కాళ్ళను ఒక బకెట్‌లో ఉంచి దానిపై టైర్‌ను కప్పి ఉంచాడు. ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది.

Read more RELATED
Recommended to you

Latest news