కమెడియన్ చెంప చెల్లుమనిపించిన లేడీ సింగర్.. ఏం జరిగిందంటే?

-

పాకిస్థాన్‌కు చెందిన ఓ కమెడియన్‌ మహిళా సింగర్‌ చేతిలో చెంపదెబ్బలు తిన్నాడు. లైవ్‌ షోలో జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

‘పబ్లిక్‌ డిమాండ్‌’ పేరుతో ఓ టీవీ ఛానెల్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాకిస్థాన్‌ ప్రముఖ గాయని షాజియా మంజూర్‌, కమెడియన్‌ శేరీ నన్హాలు పాల్గొన్నారు. లో కమెడియన్‌ నన్హా నవ్వుతూ.. ‘మన వివాహం జరిగిన తర్వాత.. హనీమూన్‌ కోసం మోంటె కార్లోకు తీసుకెళ్తాను. ఏ క్లాస్‌లో వెళ్దామో చెప్తావా’ అంటూ షాజియాను అడిగ్గా తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె అతడి చెంప చెళ్లుమనిపించింది. మహిళలతో ప్రవర్తించేది ఇలాగేనా అంటూ ఫైర్ అయింది. గతంలోనూ అతడితో ఇటువంటి ఘటన ఎదురయ్యిందని వాపోయింది. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న నిర్వాహకులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. మరోసారి ఈ షోకు రానంటూ షాజియా అక్కడినుంచి వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news