బాలీవుడ్లో వరుసగా స్టార్ హీరోహీరోయిన్లు గుడ్ న్యూస్ చెబుతున్నారు. ఇటీవలే రకుల్-జాకీల పెళ్లి జరిగింది. అంతకుముందే వరుణ్ ధావన్ తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఇక తాజాగా ఆ జాబితాలో బీ టౌన్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్ – దీపికా పదుకొణె కూడా చేరారు. ఈ జంట తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఇవాళ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ గుడ్ న్యూస్‌ను షేర్ చేసుకుంది. గత కొద్దిరోజులుగా దీపిక ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దీపిక పెట్టిన పోస్టుతో ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ జంటకు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
2013లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన రామ్ లీలా సినిమాలో తొలిసారిగా రణ్వీర్ – దీపికా పదుకొణె నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరు ప్రేమలో పడ్డారు. అలా మొదలైన వారి ప్రేమ ప్రయాణం 2018 నవంబర్‌లో పెళ్లి పీటలెక్కింది. ఇటలీలో బంధుమిత్రులు, సన్నిహుతుల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది ఈ జంట. పెళ్లయిన దాదాపు ఐదేళ్లకు ఈ జంట గుడ్ న్యూస్ చెప్పింది.
A big congratulations to Deepika Padukone and Ranveer Singh 🥹💖
Baby Padukone-Bhavnani coming soon Sept 2024 🧿 pic.twitter.com/XMS0BOdWdb
— Team DP Malaysia (@TeamDeepikaMY_) February 29, 2024