చంద్రబాబు ప్లాన్ అదే.. నేను వైసీపీ కోవర్టునా? అంటూ జనసేన అధినేత పవన్‌కు హరిరామ జోగయ్య లేఖ రాశారు. నా పార్టీ నా ఇష్టం.. నేను ఇలాగే నడుపుతా.. నచ్చినవాళ్ళే ఉండండి.. లేనివాళ్ళు వెళ్లిపోండి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య ఆవేదన చెందారు. ఈ మేరకు అయన ఇంకో లేఖను సంధించారు. జనసేన బాగుకోసం… మా కాపుల ప్రయోజనాలు కాపాడేందుకు నేను ఇస్తున్న సలహాలు మీకు నచ్చినట్లు లేవు.
చంద్రబాబే సిఎం .. వేరేవాళ్లకు అవకాశమే లేదు అని లోకేష్ చేసిన ప్రకటనను ఖండించినందుకు నేను వైసిపి కోవర్ట్ నా ? అంటూ నిప్పులు చెరిగారు. జనసేనకు 40 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు వుంటే 24 సీట్లు ఇచ్చారు… ఈ ఘోరాన్ని ప్రశ్నించినందుకు నేను వైసిపి కోవర్ట్ నా….? అని లేఖ రాశారు.
జనసేన మద్దతు లేకుండా టిడిపి గెలవడం అసాధ్యం అసాధ్యం కాబట్టే చంద్రబాబు మీతో జతకట్టాడు. ఎన్నికలు అయ్యాక చంద్రబాబు మీకు ప్రాధాన్యం ఇస్తారని నమ్మకం లేదన్నారు. కూటమి గెలిస్తే చంద్రబాబు జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి లోకేష్ ను ముఖ్యంత్రిని చేస్తారనే భయం జనసైనికుల్లో వుంది. అందుకే పవన్ కళ్యాణ్ కు గౌరవం దక్కాలని నేను డిమాండ్ చేయడం నేరమా ?అంటూ ప్రశ్నించారు జోగయ్య.