రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు జరిగింది : సీఎం సిద్దరామయ్య

-

బెంగళూర్ రామేశ్వరం కేఫ్ లో ఈ రోజు మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) బాంబు అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ధృవీకరించారు. ప్రముఖ ఫుడ్ జాయింట్గా ఉన్న రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడులో 9 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. బాంబ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్, డాగ్ స్వ్కాడ్ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.

సీసీటీవీ పుటేజీలో ఓ వ్యక్తి కేఫ్ లో బ్యాగ్ వదిలేసినట్లు సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఈ బ్యాగ్ పేలుడుకు కారణమైననట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర హోం మంత్రి సంఘటనా స్థలానికి వెళ్తున్నట్లు సీఎం వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా పేలుడు సంభవించిందని సీఎం అన్నారు. కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై సీఎం, హోంమంత్రికి పూర్తి సమాచారం అందించామని, దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఐఏ) సంఘటనా స్థలాన్ని సందర్శించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ పేలుడుపై బీజేపీ తన ఆందోళన వ్యక్తం చేసింది. బెంగళూర్ సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడుతూ.. ఇది స్పష్టంగా బాంబు పేలుడే అని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news