స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని పార్టీల ఎంపీటీసీలకి ఇవ్వాలని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కుమార్ గౌడ్ డిమాండ్ చేయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఎంపీటీసీల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత తెలంగాణలో కూడా అని రాజకీయ పక్షాలు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధం లేని వ్యక్తులకే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ ఇస్తున్నారని తమని ఘోరంగా అవమానిస్తున్నారని అన్నారు.
ఈసారి కూడా రాజకీయ పక్షాలు ఎంపీటీసీ లకి ప్రాధాన్యత ఇస్తారన్న విశ్వాసం తమకి లేకపోవడం వలన నేరుగా ఎంపిటిసినే స్థానిక సంస్థల ఎన్నికలల్లో నిలుపుతున్నారని ఆయన అన్నారు. పోరాట ఫలితంగానే 750లో ఉన్న గౌరవ వేతనం 6500 కి చేరిందని అన్నారు.