ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ టోల్ ప్లాజా సిబ్బంది సంగు కళ్యాణ్ మృతి చెందాడు.సంగు కళ్యాణ్ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టోల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు. క్రిందికి దిగే క్రమంలో నిద్రమత్తులో అదుపు తప్పి కింద పడినట్టు తెలుపుతున్నారు టోల్ అధికారులు. నిద్రిస్తున్న సమయంలో మేనేజర్ బెదిరించడంతో కంగారుగా దిగుతుండగా కింద పడి మృతి చెందినట్టు తెలుపుతున్నారు స్థానికులు,కుటుంబ సభ్యులు.
జవహర్ నగర్ టోల్ ప్లాజా సిబ్బంది సంగు కళ్యాణ్ మృతి
అయితే….సంగు కళ్యాణ్ మృతి నేపథ్యంలోనే టోల్ గేట్ ముందు టోల్ సిబ్బంది,కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఇక ఈ సమాచారం తెలుసుకుని సంఘటన స్థాలానికి చేరుకున్నారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.