అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ కియారా అద్వానీకి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న డాన్ 3 లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి కియారా తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది.
ఏకంగా ఈ మూవీ కోసం రూ.13 కోట్లు తీసుకుంటుందన్న వార్త బీటౌన్ సర్కిల్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.మరి ఈ వార్తల్లో నిజమెంతుందనేది పక్కన పెడితే.. తాజా గాసిప్‌ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆమె అభిమానులు,ఫాలోవర్లు. కియారా అద్వానీ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న గేమ్ ఛేంజర్‌లో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.అలాగే, జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తోన్న వార్ 2 చిత్రం లో కూడా నటిస్తోంది.