Manamey : శర్వానంద్‌ ‘మనమే’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న హీరోలలో శర్వానంద్ ఒకరని చెప్పవచ్చు.. తను నటించే పాత్రలు ఏదైనా సరే నటనకు తగ్గట్టుగా ఆ పాత్రలో పరిధి దాటకుండా నటిస్తూ ఉంటారు. ఎక్కువగా సహజంగా మనసుకు హత్తుకునే పాత్రలలో నటిస్తూ ఉంటాడు శర్వానంద్.

Sharwanand enters the world of Manamey

అయితే.. తాజాగా మరో కొత్త సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు.తన కెరీర్లో 35వ సినిమాను తన బర్త్డే సందర్భంగా ప్రకటించాడు శర్వానంద్. ఈ సినిమాకు మనమే అనే డిఫరెంట్ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రం బృందం.

ఇక ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ నటిస్తుండగా.. ఆయన సరసన హీరోయిన్ కృతి శెట్టి రొమాన్స్ చేయబోతుంది. ఈ సినిమాకు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య పనిచేస్తున్నారు. ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వాహద్.. సంగీతం కూడా అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్లో ఈ సినిమా వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news