నెరవేరిన 20 ఏళ్ల పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ కల..!

-

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తాజాగా ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ ను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడారు. మా నాన్న వెలిగొండ ప్రాజెక్ట్ కి శంకు స్థాపన చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ ను నేను పూర్తి చేశాను. 

వెలిగొండతో దశాబ్దాల కల నెరవేరింది. అద్భుతమైన ప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మహానేత వైఎస్ఆర్ కొడుకుగా ప్రాజెక్ట్ పూర్తి చేయడం చాలా గర్వంగా ఉంది. టన్నెల్ లో ప్రయాణించినప్పుడు సంతోషంగా కనిపించింది. రెండు టన్నెళ్లు ఒక్కొక్కటి 18.8 కిలోమీటర్లు ఉన్నాయి. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు. యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేశామని తెలిపారు. యుద్ధప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్ట్ జంట సొరంగాలు పూర్తి అయ్యాయి. చంద్రను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి భాస్కర్ ని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ప్రభుత్వంగా రికార్డు.. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నట్టు చెప్పారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news