A.P : ఇవే నాకు చివరి ఎన్నికలు: కొడాలి నాని

-

తనకు ఇవే చివరి ఎన్నికలు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం నా వయసు 53 సంవత్సరాలు. మళ్లీ పోటీ చేసేసరికి 58 సంవత్సరాలు వస్తాయి. ఆ వయసులో నేను ఎన్నికల్లో పోటీ చేయలేను. అందుకే 2029 ఎన్నికలకు దూరంగా ఉంటా అని ఆయన పేర్కొన్నారు. నా కూతుళ్లకు రాజకీయాలపై ఆసక్తి లేదు అని అన్నారు. నా తమ్ముడి కొడుక్కి ఆసక్తి ఉంటే అప్పటికి పోటీలో ఉండొచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక, అంతకు ముందుకు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘చంద్రబాబు అండ్ కో’ను గోతిలో పాతి పెట్టాలని ఆయన అన్నారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ లను గుండెల్లో పెట్టుకుని అభిమానించే ప్రతి ఒక్కరూ.. పందుల్లా వస్తున్న చంద్రబాబు, ఆయన మిత్రులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. నారా లోకేశ్ ను గెలిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ మాదిరి జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు గెంటేసి తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకుంటారని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news