ప్రెగ్నెన్సీ టీప్‌: బ్రీచ్‌ డెలివరీ అంటే ఏంటి..? బిడ్డకు ఏమైనా ప్రమాదం ఉంటుందా..?

-

ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు గర్భిణులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏం తినకుడదు, ఏం చేయాలి..ఇలా చాలా ఉంటాయి.. ఇంట్లో వాళ్లు చెప్పే టిప్స్‌ కొన్ని అయితే.. వైద్యులు చెప్పే సలహాలు ఇంకెన్నో.. నెలలు గడిచే కొద్ది.. తల్లికి కడుపులో బిడ్డ కదలికలు తెలుస్తాయి.. కాలితో తన్నడం మొదలుపెట్టినప్పుడు..ఆ తల్లి ఆనందానికి అవధులు ఉండవు.. కానీ డెలివరీ అయ్యేప్పుడు నరకం అనుభవిస్తారు.. నార్మల్‌ డెలివరీ కష్టం అయితే సిజేరియన్‌ కూడా చేయాల్సి వస్తుంది.. సాధారణంగా బిడ్డ తల కింద ఉంటే.. డెలివరీ చేయడం తేలిక అవుతుంది.. కానీ కొన్నిసార్లు.. తల భాగం పైకి ఉండి.. కాళ్లు, పిరదులు కిందకు ఉంటాయి.. అంటే ముందు కాళ్లు బయటకు వచ్చేలా ఉంటాయి.. దీన్ని బ్రీచ్‌ డెలివరీ అంటారు.. ఇలా ఉండటం సాధారణమైనా..? బిడ్డకు ఏమైనా ప్రమాదం ఉంటుందా..? బిడ్డ ఈ పొజిషిన్‌లో ఉన్నాడు అని.. ముందే ఎలా తెలుసుకోవడం, తిరిగి మామూలు స్థితికి ఎలా తీసుకురావడం ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..!

గర్భదారణ సమయంలో బ్రీచ్‌ డెలివరీ సాధారణం.. 28 వారాలలో 20-25 శాతం మందికి ఇలానే జరుగుతుంది. బిడ్డ పెరిగే కొద్ది.. ఈ స్థితి నుంచి మామూలు స్థితికి రావడానికి.. 3-5 శాతం అవకాశం ఉంటుందని.. ఫెర్నాండైజ్‌ ఫౌండేషన్‌ మిడ్‌వైఫరీ హెడ్‌ లాయ్లా రంబుల్‌ అన్నారు.

ఇలా ఎందుకు జరుగుతుంది

బిడ్డ కడుపులో తలకిందులుగా మారడానికి చాలా కారణాలు ఉంటాయి… అందులో ప్రధానంగా.. తల్లికి ఉమ్మనీరు తక్కువగా ఉండటం, గర్భం ఆకృతి కూడా బ్రీచ్‌ ప్రజెంటేషన్‌కు కారణాలు అవుతాయి.

బ్రీచ్‌ పొజిషన్‌లో ఉన్నట్లు ఎలా తెలుసుకోవాలి..?

మీరు ఇంతకుముందే ఒకసారి గర్భందాల్చితే ఈ పరిస్థితిని కనుక్కోవడం తేలిక అవుతుంది. కానీ మొదటి సారి తల్లి అవ్వబోతున్న వాళ్లు.. బిడ్డ ఎక్కడ తన్నుతున్నాడో గమనించుకోవాలి.. నార్మల్‌ పొజిషన్‌లో ఉంటే.. తల కిందకు ఉంటుంది..కాళ్లు తల్లి ముఖం వైపు ఉంటాయి..కాబట్టి తన్నితే ఎక్కడ అనేది తెలుసుకోవచ్చు.. ఒకవేళ బిడ్డ కడుపులో బ్రీచ్‌ పొజిషన్‌లో ఉంటే.. బిడ్డ కిక్ చేసినప్పుడు మీకు పొట్ట కింద నొప్పి వస్తుంది..మీకు ఇలా అనిపిస్తే..మీ వైద్యులను సంప్రదించండి.. అల్ట్రాసౌండ్‌ ద్వారా వారు పరీక్షిస్తారు. 36వారాలకు వచ్చేసరికి.. బిడ్డ పొజిషన్‌ సెట్‌ అవుతుందని డాక్టర్‌ రంబుల్‌ అంటున్నారు.

బ్రీచ్‌ పొజిషన్‌లో ఉంటే ఏం చేయాలి..?

ఒకవేళ మీ బిడ్డ బ్రీచ్‌ పొజిషన్‌లో ఉన్నట్లు నిర్ధారణ అయితే.. కొన్ని తేలికపాటి వ్యాయామాల ద్వారా మీ బిడ్డ స్థితిని మార్చుకోవచ్చు. వైద్యులు ఎక్స్‌టర్నల్ సెఫాలిక్ వెర్షన్ (ECV) ద్వారా బొడ్డుపై ఒత్తిడి తీసుకువచ్చి..బిడ్డ పొజిషన్‌ను మారుస్తారు. ఈ విధానంలో బిడ్డ స్థితి కచ్చితంగా మారుతుందని చెప్పలేం. సక్సస్‌ రేట్‌ కేవలం 50 శాతం మాత్రమే ఉంది..ఈ పద్ధతిలో సక్సస్‌ కాకపోతే.. సీ సెక్షన్‌ ద్వారా డెలివరీ చేస్తారు. సీ సెక్షన్‌ ద్వారా డెలివీ చేస్తే.. తల్లికి చాలా ఇబ్బంది అవుతుంది.. బ్రీచ్‌ పొజిషన్‌లో కూడా నార్మల్‌ డెలివరీ చేయొచ్చు..కానీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే.. వైద్యులు సీ సెక్షన్‌ డెలివరీనే ఎంపిక చేసుకుంటారు.

సీ సెక్షన్‌ డెలివరీ కంటే.. నార్మల్‌ డెలివరీ చేయడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు అని పెద్దలు అంటారు.. అవును నార్మల్‌ డెలివరీ వల్ల తల్లి ఆరోగ్యంగా ఉంటుంది.. ఆ తర్వాత కూడా త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. కానీ సీ సెక్షన్‌లో తల్లి రెండింతలు జాగ్రత్తలు తీసుకోవాలి. కుట్లు తెగిపోకుండా చూసుకోవాలి..ఇది చాలా కష్టం.. బ్రీచ్‌ పొజిషన్‌లో కూడా వీలైనంత వరకూ సాధారణ డెలివరీకే ప్రాధాన్యత ఇవ్వమని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ఎలాంటి డెలివరీ అయినా బిడ్డ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదని తల్లి తెలుసుకోవాలి. లేదంటే ఈ డిప్రషన్‌తో తల్లి ఆందోళన చెందుతుంది. మీరు మీ బిడ్డ కదలికలను బట్టి బిడ్డ ఏ పొజిషన్‌లో ఉన్నాడో తెలుసుకుని వైద్యులను సంప్రదిస్తే సరి..! అంతకు మించి ఎలాంటి టెన్షన్‌ పెట్టుకోవద్దని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. ఈరోజుల్లో ఎలాంటి సమస్యకైనా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..!

Read more RELATED
Recommended to you

Latest news