ఎంట్రప్రెన్యురల్ సమ్మిట్‌లో ప్రసంగించాలని కేటీఆర్‌కు ఐఐటి మద్రాస్ ఆహ్వానం

-

బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్కు మరో గౌరవమైన ఆహ్వానం అందింది. ఐఐటీ మద్రాస్‌లో జరిగే ఎంట్రప్రెన్యురల్ సమ్మిట్‌లో ప్రసంగించాల్సిందిగా తాజాగా కేటీఆర్‌ ఆహ్వానం అందుకున్నారు. ఐఐటీ మద్రాస్‌లో ప్రతి ఏటా ఎంట్రప్రెన్యురల్ సమ్మిట్‌ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్కు దేశ, విదేశాల నుంచి ఎంట్రప్రెన్యురల్ రంగంలో కీలకమైన వ్యక్తులు, సంస్థల అధిపతులు, ప్రముఖులని అహ్వానిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సమ్మిట్కు కేటీఆర్ ఆహ్వానం అందుకున్నారు. ఆయనకు ఉన్న అపార అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్‌ ఎంట్రప్రెన్యురల్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా ఐఐటీ మద్రాస్ ఆహ్వానంలో కోరింది. దేశంలో అంతర్జాతీయ గుర్తింపు- ఐఎస్ఓ సర్టిఫికేషన్ కలిగిన కార్యక్రమంగా ఈ సమ్మిట్ నిలిచింది. ఈనెల 10, 11వ తేదీల్లో జరిగే ఈ సమావేశంలో కేటీఆర్తో పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్‌ గోపాల కృష్ణన్, హెచ్సీఎల్ సహ వ్యవస్థాపకులు అజయ్‌ చౌదరి వంటి ప్రముఖులు ప్రసంగించనున్నట్లు ఐఐటీ మద్రాస్ తెలిపింది. ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news