యాంకరింగ్ వదిలేసి జిమ్ లో కసరత్తులు చేస్తున్నా ప్రదీప్…. ఆ మూవీ కోసమేనా..?

-

ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలాకాలంగా బుల్లితెరపై తన హావభావాలు యాంకరింగ్ తో అందరినీ మెప్పిస్తున్నాడు.ప్రదీప్ మాచిరాజుకి గడసరి అత్త సొగసరి కోడలు షో ఫేమ్ తెచ్చింది. చాలా సంవత్సరాల పాటు ఇందులో యాంకరింగ్ చేశాడు. ఆ తర్వాత కొంచెం టచ్ లో ఉంటే చెప్తా లో కూడా తనదైన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఈటీవీలో డీ రియాల్టీ షోలో తనదైన యాంకరింగ్ తో మరో లెవల్ కు తీసుకెళ్లాడు.

 

Pradeep Machiraju

కాగా ప్రదీప్ మాచిరాజు సడన్ గా బుల్లితెరకు దూరం అయ్యాడు. ఢీ షోలో ప్రదీప్ స్థానంలో నటుడు నందు వచ్చాడు. ఢీ తో పాటు ఇతర షోలలో కూడా ప్రదీప్ కనిపించడం లేదు. ఈ క్రమంలో ప్రదీప్ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రదీప్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. ప్రదీప్ జిమ్ లో కసరత్తులు చేస్తూ విపరీతంగా కష్టపడుతున్నాడు. అతడు కండలు తిరిగిన బాడీ కలిగి ఉన్నాడు. ప్రదీప్ మేకోవర్ షాక్ ఇస్తుంది. ఇక ఆయన లుక్ ఆకట్టుకుంది. దీంతో ప్రదీప్ తన నెక్స్ట్ మూవీ కోసమే ఇదంతా అని నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news