పెళ్లి చేసుకున్న బంగారం మూవీ బ్యూటీ మీరా చోప్రా

-

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవల టాలీవుడ్లో యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ప్రియుడిని పెళ్లాడింది. అంతే కాకుండా ఈ నెలలోనే మరో హీరోయిన్ కృతి కర్బందా కూడా వివాహాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా మరో బ్యూటీ కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి చేసుకున్నారు. 40 ఏళ్ల వయసులో ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుంది.వ్యాపారవేత్త రక్షిత్ కేజీవాల్తో ఆమె వివాహం ఇవాళ జైపూర్లో గ్రాండ్ గా జరిగింది. వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ మీరా చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అంతే కాకుండా తెలుగులో వాన, మారో, గ్రీకు వీరుడు వంటి తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాల్లోనూ హీరోయిన్గా మీరా చోప్రా నటించింది.ఈ ముద్దుగుమ్మ ఇదివరకే పెళ్లి చేసుకోబోతున్నట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news