రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారు : సీఎం రేవంత్ రెడ్డి

-

ఎన్నికల కు ముందు ఆరు గ్యారంటీలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలు అయినప్పటి నుండి టిఆర్ఎస్ నాయకులు ఏదో ఒక విధంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.ఆర్టీసీ ఉచిత ప్రయాణం వద్దని బీఆర్ఎస్ వాదిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఫ్రీ బస్ పథకానికి అడ్డేస్తే బీఆర్ఎస్ శ్రేణులపైకి ఆర్టీసీ ప్రగతి రథాలు ఎక్కిస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ‘సోనియా గాంధీ మాటిస్తే వెనక్కి తీసుకోరు. రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా రాష్ట్రం ఇచ్చారు అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ధన్యవాదాలు తెలిపారు. పదేళ్లు రాష్ట్రంలో మహిళలు కన్నీరు పెట్టుకున్నారు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వాన్ని పడగొడతామని ఎవరైనా అంటే వారిని చీపుర్లతో కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ, కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘కేసీఆర్కు మహిళల ఉసురు తగిలింది. అందుకే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారు అని అన్నారు. నాకు ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంది కాబట్టే నేను గెలిచా’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news