ఏడు శాతం రైతులకు రైతు బంధు కట్ !

-

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్‌ సర్కార్‌ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఏడు శాతం రైతులకు రైతు బంధు కట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిందని సమాచారం అందుతోంది. రైతు బంధులో సీలింగ్ మొదలు పెట్టిందట కాంగ్రెస్ ప్రభుత్వం. టాక్స్ పేయర్ భూములు, సాగులో లేని భూములు, పొలిటికల్ లీడర్లకు సంబంధించున భూములకు రైతు బంధు కట్ చేసేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టు సమాచారం అందుతోంది.

raithu bandu

కాగా, రైతుబంధు డబ్బుల జమపై కేబినెట్లో చర్చించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ‘ఇప్పటివరకు 84శాతం మందికి రైతుబంధు సాయం అందించాం అని తెలిపారు. రాబోయే 2 రోజుల్లో సాయం 93శాతానికి చేరుతుంది అని అన్నారు. అర్హులందరికీ సాయం అందిస్తాం. డబ్బుల జమపై అధికారులకు ఆదేశాలు ఇచ్చాం’ అని వెల్లడించారు.ఇక అనర్హులకు రైతు భరోసా ఇవ్వబోమని.. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.సాగు చేయని, సాగు చేయడానికి పనికిరాని కొండలు, గుట్టలు.. ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతుబంధు సాయం ఇచ్చారని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news