రైతుబంధుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. కొద్ది రోజుల్లోనే 5 ఎకరాల వరకు రైతుబంధు వేస్తామని వెల్లడించారు. ఆ తర్వాత అందరికీ రైతుబంధు వేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎ రేవంత్ రెడ్డి…ఏమో ఆల్రెడీ 5 ఎకరాల ఉన్న వాళ్ళందరికీ ఏకంగా రైతు భరోసా (ఎకరాకు 15 వేలు)నే వేశామని నిన్న ప్రకటించారు.
ఇక అటు ఏడు శాతం రైతులకు రైతు బంధు కట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిందని సమాచారం అందుతోంది. రైతు బంధులో సీలింగ్ మొదలు పెట్టిందట కాంగ్రెస్ ప్రభుత్వం. టాక్స్ పేయర్ భూములు, సాగులో లేని భూములు, పొలిటికల్ లీడర్లకు సంబంధించున భూములకు రైతు బంధు కట్ చేసేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టు సమాచారం అందుతోంది.