నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు… నేను BRS పార్టీలోనే ఉన్నా – ఆరూరి రమేష్

-

నంది నగర్‌లో కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఆరూరి రమేష్. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని ఈ సందర్బంగా మీడియాతో తెలిపారు ఆరూరి రమేష్. అంతకు ముందు ఆరూరి రమేష్‌ను తీసుకెళ్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ వాహనాన్ని అడ్డుకున్నారు బీజేపీ నేతలు. దీంతో జనగామ జిల్లా పెంబర్తి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

aroori ramesh went to kcr house

ఆరూరి రమేష్‌ను తీసుకెళ్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని అడ్డుకున్నారు బీజేపీ నేతలు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాటలో ఆరూరి రమేష్‌ చొక్కా చిరిగిపోయింది. అనంతరం నంది నగర్‌లో కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఆరూరి రమేష్. అనంతరం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆరూరి రమేష్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news